హైదరాబాద్‌లో జరిగిన PDSF రాష్ట్ర ఆవిర్భావ సమావేశంలో నాయకుల
హైదరాబాద్, జూలై 19: రాష్ట్రంలో విద్యారంగాన్ని వేధిస్తున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరంతర ఉద్యమాన్ని కొనసాగిస్తామని PDSF (ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్) రాష్ట్ర నాయకులు ప్రకటించారు.
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన PDSF రాష్ట్ర నిర్మాణ ఆవిర్భావ సమావేశంలో నాయకులు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని తెలిపారు.

విద్యార్థుల హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో PDSF రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








