-- --

బెలాల్ పంచాయతీ అక్రమాలపై అధికారుల మౌనం ఎందుకు..? విచారణ చేస్తామన్న హామీ మాటలకే పరిమితమా..?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మూడు రోజులైనా చర్యలు శూన్యం.. నిధుల గోల్మాల్ ఆరోపణలు, వేతనాల్లో కోతలు, అదనపు నియామకాలపై సమగ్ర విచారణ కోరుతున్న కొందరు వార్డ్ సభ్యులు. కొందరుగ్రామస్తులు..

బెలాల్, జూలై 19:

నిజామాబాద్ జిల్లా బెలాల్ గ్రామపంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, కొనుగోళ్లలో అక్రమాలు, అదనపు వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా వేతనం చెల్లించడం, గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాల్లో కోతలు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు మూడు రోజుల క్రితమే వెలుగులోకి వచ్చినప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం గ్రామస్థుల్లో అనుమానాలకు తావిస్తోంది.

గ్రామపంచాయతీలో ప్రభుత్వ అనుమతితో సిబ్బందికి వేతనాలు వస్తున్నప్పటికీ, అదనంగా ఒక వ్యక్తిని నియమించి పంచాయతీ నిధుల నుంచే వేతనం చెల్లిస్తున్నారని కొందరు వార్డ్ సభ్యులు. గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులను ఎంబీ రికార్డుల ఆధారంగా దుర్వినియోగం చేసి, కారోబారి (బిల్ కలెక్టర్) ఖాతాలోకి నిధులు మళ్లించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

గ్రామపంచాయతీ సిబ్బందికి పూర్తి వేతనాలు అందడం లేదని, వేతనాల్లో కోతలు విధిస్తున్నారని, హాజరు పట్టికలను పారదర్శకంగా నిర్వహించడం లేదని వార్డ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొందరు సిబ్బంది తమ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారని, ప్రశ్నించిన వారితో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల ఎమ్మెల్యే పోచారం సుదర్శన్ రెడ్డిని కలిసి గ్రామంలోని ఆరోపణలను వివరించిన అనంతరం, “గ్రామ అభివృద్ధి నిధుల కోసం మాత్రమే కలిశాం” అంటూ వాస్తవాలకు భిన్నంగా ప్రచారం జరుగుతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అక్రమాలపై వచ్చిన ఆరోపణల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా అనే సందేహాలను వారు వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు “విచారణ చేస్తాం” అని హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నప్పటికీ, ఆ హామీ అమలులోకి వచ్చిందా లేదా అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

 కొందరు వార్డ్ సభ్యులు   గ్రామస్థులు సంధిస్తున్న ప్రశ్నలు…

  • విచారణ జరుపుతామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు..?
  • ప్రజాధనంపై వచ్చిన ఆరోపణలు అంత తేలికైనవేనా..?
  • అసలే నిధులు గోల్మాల్ అయితే… మళ్లీ అభివృద్ధి నిధులు ఎందుకు..?
  • విచారణ నిజంగానే జరుగుతుందా..? లేక ప్రజలను మభ్యపెట్టేందుకే హామీలు ఇచ్చారా..?
  • కారోబారి ఖాతాలోకి నిధులు ఎందుకు జమయ్యాయి..?
  • అదనపు నియామకం ఏ నిబంధన ప్రకారం జరిగింది..?
  • ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలు వస్తే స్పందించడం అధికారుల బాధ్యత కాదా..?
  • బాధ్యులెవరైనా చట్టం ముందు అందరూ సమానమే కాదా..?

గ్రామపంచాయతీలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అన్ని ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్లు, వేతనాల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీలపై జిల్లా స్థాయి అధికారులతో స్వతంత్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని గ్రామస్థులు మరోసారి డిమాండ్ చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ గారికి – ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి కొందరు వార్డ్ సభ్యులు  గ్రామస్తుల  విజ్ఞప్తి..

“జిల్లా కలెక్టర్ గారూ… ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారూ… బెలాల్ గ్రామపంచాయతీలో ప్రజాధనంపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అన్నది వెంటనే సమగ్ర విచారణ ద్వారా తేల్చండి. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని పరిరక్షించండి. విచారణ చేస్తామన్న హామీ అమలులోకి రావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.”

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు గ్రామస్థులు, వార్డ్ సభ్యులు చేసిన ఆరోపణలు మరియు వారి విజ్ఞప్తుల ఆధారంగా రూపొందించబడ్డాయి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందన అందిన వెంటనే ప్రచురించడం పత్రికా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

ప్రజాధనం పవిత్రం… దాన్ని దోచిన వారిని కాపాడే మౌనం కూడా నేరమే; నిజాయితీకి విచారణే నిదర్శనం!”

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more