-- --

భక్తి పారవశ్యంలో శ్రీ అలివేలు మంగమ్మ రథయాత్ర.. అచన్‌పల్లి నుంచి బస్టాండ్ వరకు అంగరంగ వైభవం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

లక్షా 10 వేల కాకినాడ కాజాల ప్రసాదం పంపిణీ – చిన్నారుల సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ

బోధన్, జూలై 19:
బోధన్ పట్టణంలోని అచన్‌పల్లి శ్రీ అలివేలు మంగమ్మ ఆలయం నుంచి బస్టాండ్ వరకు ఆదివారం నిర్వహించిన శ్రీ అలివేలు మంగమ్మ రథయాత్ర భక్తి శ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారణలు, భజనలు, గోవింద నామస్మరణల మధ్య ప్రారంభమైన ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి తూము పద్మ శారత్ రెడ్డి, శారత్ రెడ్డి దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్‌కు చెందిన అశోక్ నిత్యదాస్, రాధిక మాతాజీతో పాటు ఇస్కాన్ బృందం పాల్గొని భక్తులకు సుమారు 1,10,000 కాకినాడ కాజాలను ప్రసాదంగా పంపిణీ చేసింది.

రథయాత్రలో చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. అచన్‌పల్లి నుంచి ప్రారంభమైన రథయాత్ర టీటీడీపీ కళ్యాణ మండపం వరకు కొనసాగనుండగా, అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన ప్రసాద పంపిణీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ అలివేలు మంగమ్మ తల్లివారి ఆశీర్వాదాలు పొందారు.

దైవభక్తి ఉన్న చోట దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.”

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more