-- --

భక్తిశ్రద్ధలతో ఘనంగా బోనాల వేడుకలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సరస్వతి నగర్ నుంచి మహాలక్ష్మి ఆలయం వరకు వైభవంగా ఊరేగింపు – అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు
బోధన్, జూలై 19 (వి.1 న్యూస్):
బోధన్ పట్టణంలో ఆషాఢ మాస బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. సరస్వతి నగర్‌లోని లయోలా పాఠశాల నుంచి మిమ్స్ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాల కాలనీల ప్రజలు పోతరాజుల విన్యాసాలు, భాజా భజంత్రీల నడుమ భారీ ఊరేగింపుగా కొత్త బస్ స్టాండ్ మీదుగా నల్ల పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
అనంతరం షర్బతి కెనాల్ ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో కాలనీ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలు, సంప్రదాయ బోనాల ఊరేగింపుతో బోధన్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more