బోధన్‌లో ఘన సన్మానం.. సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన డైరెక్టర్ హామీ
బోధన్, జూలై 19 (వి.1 న్యూస్):
నిజామాబాద్ జిల్లా కమ్మ సంఘంలో కోటగిరి మండలం తరపున డైరెక్టర్‌గా వేములపల్లి ఆనంద్ కుమార్ (సత్యనారాయణ కుమారుడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బోధన్ కమ్మ సంఘం కార్యాలయంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించి సంఘ నాయకులు అభినందనలు తెలిపారు.
కమ్మ సంఘం అధ్యక్షుడు పల్లెంపాటి శివన్నారాయణ, ఉపాధ్యక్షుడు వెనిగళ్ల సునీల్, ట్రెజరర్ పల్లెంపాటి శ్రీధర్ శాలువాతో సత్కరించి, నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, వేములపల్లి ఆనంద్ కుమార్ నాయకత్వంలో కమ్మ సంఘం మరింత అభివృద్ధి చెందడంతో పాటు సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నూతన డైరెక్టర్ వేములపల్లి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం నాయకులు, సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొని వేములపల్లి ఆనంద్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







