పెస్టిసైడ్ సబ్సిడీ, హౌస్ నంబర్, అక్రమ నిర్మాణం, వృద్ధాప్య పెన్షన్ అంశాలపై వినతులు
బోధన్, జూలై 20:
బోధన్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డివిజన్ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం నాలుగు దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.
ఈ సందర్భంగా గ్రామ సహకార సంఘం ద్వారా అందాల్సిన పెస్టిసైడ్ సబ్సిడీ లభించలేదని ఒక రైతు ఫిర్యాదు చేయగా, హౌస్ నంబర్ మంజూరు చేయాలని మరో దరఖాస్తుదారు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రైవేట్ స్థలంలో అక్రమంగా నిర్మించిన గోడను తొలగించాలని మరో ఫిర్యాదు నమోదు కాగా, వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని మరో అభ్యర్థి వినతిపత్రం సమర్పించారు.

ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖలకు పంపించి, నిబంధనల ప్రకారం విచారించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆర్డీవో కార్యాలయం ఆదేశించింది. ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రజావాణి వేదికగా ఉపయోగపడుతోందని అధికారులు తెలిపారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







