మూడు రోజుల క్రితమే వెలుగులోకి వచ్చిన ఆరోపణలు.. ఇప్పటికీ కదలని యంత్రాంగం.. సమగ్ర విచారణ కోరుతున్న గ్రామస్థులు
బెలాల్, జూలై 19:
నిజామాబాద్ జిల్లా బెలాల్ గ్రామపంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, కొనుగోళ్లలో అక్రమాలు, సిబ్బంది వేతనాల్లో కోతలు, అదనపు వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా వేతనం చెల్లిస్తున్నారనే ఆరోపణలు మూడు రోజుల క్రితమే వెలుగులోకి వచ్చినప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం గ్రామస్థుల్లో అనుమానాలకు తావిస్తోంది.
గ్రామపంచాయతీలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక లావాదేవీలు, బోరు మోటారు కొనుగోలు, సిమెంట్ పైపుల కొనుగోలు, సిబ్బంది వేతనాల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్థులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా, అధికార యంత్రాంగం నుంచి స్పందన కనిపించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది అధికారులు “విచారణ చేస్తాం” అని హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నప్పటికీ, ఆ హామీ అమలులోకి వచ్చిందా లేదా అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

గ్రామస్థులు సంధిస్తున్న ప్రశ్నలు…
- విచారణ జరుపుతామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు..?
- ప్రజాధనంపై వచ్చిన ఆరోపణలు అంత తేలికైనవేనా..?
- విచారణ నిజంగానే జరుగుతుందా..? లేక ప్రజలను మభ్యపెట్టేందుకే హామీలు ఇచ్చారా..?
- ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలు వస్తే స్పందించడం అధికారుల బాధ్యత కాదా..?
- బాధ్యులెవరైనా చట్టం ముందు అందరూ సమానమే కాదా..?
గ్రామపంచాయతీ వ్యవహారాలపై జిల్లా స్థాయి అధికారులతో స్వతంత్ర విచారణ జరిపించి, సంబంధిత రికార్డులు, బిల్లులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని గ్రామస్థులు మరోసారి డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ గారికి – ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి గ్రామస్థుల విజ్ఞప్తి
“జిల్లా కలెక్టర్ గారూ… ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారూ… బెలాల్ గ్రామపంచాయతీలో వచ్చిన ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణకు ఆదేశించి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించండి. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని పరిరక్షించండి” అని గ్రామస్థులు కోరుతున్నారు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు గ్రామస్థులు, వార్డ్ సభ్యులు చేసిన ఆరోపణలు మరియు వారి విజ్ఞప్తుల ఆధారంగా రూపొందించబడ్డాయి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల వివరణ అందిన వెంటనే ప్రచురించడం పత్రికా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంద
“ప్రజాధనం పవిత్రం… దాన్ని దోచిన వారిని కాపాడే మౌనం కూడా నేరమే!”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








