-- --

V1News Telangana

విద్యాసంస్థల్లో అలజడి సృష్టిస్తే క్రిమినల్ కేసులు తప్పవు: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్, జూలై 2: విద్యార్థి సంఘాల పేరుతో పాఠశాలలు, కళాశాలల్లో అక్రమంగా ప్రవేశించి యాజమాన్యాన్ని బెదిరించడం, ఆస్తులను ధ్వంసం చేయడం, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని పలు విద్యాసంస్థల నుంచి ఇటీవల ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గురువారం ప్రకటన విడుదల చేశారు. కొన్ని విద్యార్థి సంఘాలు వివిధ సమస్యలను సాకుగా చూపుతూ విద్యాసంస్థల్లో అనుమతి లేకుండా ప్రవేశించి యాజమాన్యాన్ని బెదిరించడం, విద్యార్థుల చదువులకు అంతరాయం కలిగించడం, విద్యాసంస్థల్లో భయాందోళన వాతావరణం సృష్టించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపూర్–బర్దిపూర్ శివారులో ఉన్న నారాయణ విద్యాసంస్థలో అక్రమంగా ప్రవేశించి కుర్చీలు, ఫ్లెక్సీలు తదితర వస్తువులను ధ్వంసం చేసిన ఘటనలో సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూర్ మండలంలోని శ్రీ సాయి విద్యాలయం పాఠశాలలో యాజమాన్యం అనుమతి లేకుండా ప్రవేశించి సిబ్బందిని బెదిరించడం, విద్యార్థులను భయాందోళనకు గురిచేయడం, వస్తువులను ధ్వంసం చేసిన ఘటనలోనూ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి కేసులు ఉన్నట్లయితే అదనపు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

విద్యాసంస్థలకు సంబంధించిన సమస్యలు ఉంటే సంబంధిత జిల్లా అధికారులు లేదా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని, నిబంధనల ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని కమిషనర్ తెలిపారు. విద్యార్థి సంఘాల పేరుతో పాఠశాలల్లో అనుమతి లేకుండా ప్రవేశించడం, బంద్‌లు నిర్వహించడం, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

అలాగే, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు, కళాశాలలను బలవంతంగా బంద్ చేయించడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హెచ్చరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more