బోధన్, జూలై 1: జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ శ్రీ హరి సేవా ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జనరల్ హాస్పిటల్‌లో సేవలందిస్తున్న క్లబ్ సభ్యులు, వైద్యులు డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ విక్రమ్, డాక్టర్ యశస్విని, డాక్టర్ కృష్ణలను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వారి పాత్ర అమూల్యమని వక్తలు పేర్కొన్నారు. డాక్టర్ల సేవాస్ఫూర్తి అందరికీ ఆదర్శమని అభినందించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ శ్రీ హరి సేవా అధ్యక్షురాలు లయన్ కొత్తపల్లి నవిత, కోశాధికారి లయన్ తన్నీరు రాజ్యలక్ష్మి, జోన్ చైర్మన్ (ZC) లయన్ జానకిరామ్, రీజియన్ చైర్మన్ (RC) ఎంఎజేఎఫ్ లయన్ తన్నీరు సుబ్బారావు, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ విక్రమ్, డాక్టర్ యశస్విని, డాక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ వివరాలను లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ శ్రీ హరి సేవా కార్యదర్శి తూము వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







