బోధన్, జూలై 2: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 13వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం కొనసాగుతోంది. వార్డు కౌన్సిలర్ లంక రవి ఆధ్వర్యంలో ఓటర్ల నుంచి ఎస్ఐఆర్ దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ చేపట్టారు.
ఈ సందర్భంగా బోధన్ మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ) పీ. విఠల్ గురువారం 13వ వార్డును సందర్శించి ఎస్ఐఆర్ ఫారాల నమోదు తీరును పరిశీలించారు. నమోదు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
అలాగే, బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ) మహ్మద్ సైఫుద్దీన్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూ, ఎస్ఐఆర్ ఫారాలను సక్రమంగా నింపేందుకు సహకరించారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకుని ప్రక్రియలో పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







