Post Views: 35
రుద్రూర్, జూలై 1): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ (ఎండీఎం) ప్రవీణ్, డీసీఎస్వో శ్రీకాంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వంటగదిని తనిఖీ చేసి, నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని పరిశీలించి, విద్యార్థుల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.
పాత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని గుర్తించిన అధికారులు, ఈ విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు సమగ్ర నివేదిక పంపించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








