-- --

V1News Telangana

ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా సందర్శించాలి: బీడీఎస్ఎఫ్ డిమాండ్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూలై 2: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించాలని బీడీఎస్ఎఫ్ (BDSF) విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.

రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం బోధన్ మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయం ఎదుట బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, అనంతరం విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ తల్లారే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని అన్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇతర కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కోరారు.

బోధన్ మండలంలోని మధుమలాంచ ప్రభుత్వ పాఠశాల రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆరోపించారు. పాఠశాల ప్రహరీ గోడ నిర్మించి, రాత్రి సమయంలో భద్రతా చర్యలు చేపట్టి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాల్సిన 21 రకాల విద్యా కిట్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను ఆలస్యం లేకుండా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద, బహుజన విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖ అధికారులు తరచూ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ బోధన్ పట్టణ అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి నరేందర్, జిల్లా నాయకులు రాజు, దీపక్, లాలూ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more