June 24, 2026 12:33 am

V1News Telangana

ఓటరు జాబితా సవరణల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో BLOలు, BLAలకు శిక్షణ కార్యక్రమం – ఓటరు నమోదు, సవరణలపై అవగాహన..
బోధన్, జూన్ 23:
బోధన్ శాసనసభ నియోజకవర్గ స్థాయిలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన BLO (బూత్ స్థాయి అధికారులు), BLA (బూత్ స్థాయి ఏజెంట్లు) శిక్షణ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గౌరవ సలహాదారులు పొదెం సుదర్శన్ రెడ్డి మరియు బోధన్ ఆర్డీవో శ్రీమతి ఎం. విజయ కుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు, ఇతర సవరణలను నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు.
ఆర్డీవో ఎం. విజయ కుమారి మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా BLOలు, BLAలు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఓటరు నమోదు, పేర్ల సవరణ, తొలగింపు, మార్పులు, ఎన్నికల ప్రక్రియలో BLOలు, BLAల బాధ్యతలపై విపులంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన BLOలు, BLAలు, ఎన్నికల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more