చదువే శాశ్వత సంపద.. ప్రభుత్వ బడే ప్రతి బిడ్డ భవిష్యత్తుకు బంగారు బాట.”
“తన బిడ్డను ప్రభుత్వ బడిలో చేర్చిన నాయకుడే నిజమైన ప్రజాప్రతినిధి.”
నిజామాబాద్ జిల్లా, సాలూర మండలం, మందర్న గ్రామం, జూన్ 23 (ప్రతినిధి):
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా మందర్న గ్రామ సర్పంచ్ రావువ సావిత్ర గంగాధర్ తన కుమార్తె ఆర్. దివ్యను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ విద్యపై తమకున్న నమ్మకాన్ని ఆచరణలో చూపిస్తూ ఇతర తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా మందర్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ రావువ సావిత్ర గంగాధర్, ఉపసర్పంచ్ శిరీష ప్రహ్లాద్, మహిళా సంఘం అధ్యక్షురాలు కుక్కలుగే శకుంతల, ప్రధానోపాధ్యాయురాలు వసంత మేడం చేతుల మీదుగా విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








