ఆదాయానికి మించిన ఆస్తులపై ఫిర్యాదు నేపథ్యంలో దర్యాప్తు
వినాయక్ నగర్, జూన్ 23 (ప్రతినిధి):
నిజామాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం నిర్వహించిన దాడులు కలకలం రేపాయి. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఉదయం నుంచే జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం, నగరంలోని ప్రగతి నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి.
సోదాల సందర్భంగా కార్యాలయంలోని పలు కీలక పత్రాలను, నివాసం నుంచి పలు రికార్డులు, ఇతర విలువైన వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అధికారులు తమ వెంట తీసుకెళ్లి విచారణ చేపట్టినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో ఉన్న ఆయన మరో నివాసంలో కూడా ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాల్లో లభించిన ఆదాయానికి మించిన ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఇతర పత్రాలపై సమగ్ర పరిశీలన అనంతరం పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







