June 23, 2026 10:47 pm

V1News Telangana

బోధన్ కోర్టు ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులకు వైద్య సేవలు

బోధన్, జూన్ 23:
బోధన్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం బార్ అసోసియేషన్ బోధన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం (ఫ్రీ మెడికల్ క్యాంప్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ కళ్ల ఆసుపత్రి, బోధన్ జనరల్ ఆసుపత్రి మరియు నిజామాబాద్‌కు చెందిన మనోరమ ఆసుపత్రి వైద్య బృందాలు సహకారం అందించాయి.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఆర్. దేశాయ్ మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థకు సేవలందిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు శాఖ సిబ్బంది, కక్షిదారుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

శిబిరంలో పాల్గొన్న వారికి సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు, చికిత్సలు అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించగా, పలువురు వైద్య సేవలను వినియోగించుకున్నారు.

“ఆరోగ్యమే మహాభాగ్యం… ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయి” అని పలువురు అభిప్రాయపడ్డారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more