June 24, 2026 12:32 am

V1News Telangana

శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

స్టార్ట్ అప్ చారిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి అందజేత

బోధన్, జూన్ 23:
బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్‌లో గల శ్రీ సరస్వతి శిశు మందిరంలో మంగళవారం విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. స్టార్ట్ అప్ చారిటీ సర్వీసెస్ కార్యక్రమంలో భాగంగా బూస గంగారాం కుటుంబ సభ్యులు సునీత, విరికా ఈ విద్యా సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా దాతల సేవా భావాన్ని అభినందించిన శ్రీ సరస్వతి శిశు మందిర్ కమిటీ సభ్యులు వారికి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ అధ్యక్షుడు గణేష్, కమిటీ సభ్యులు మహేష్, నరేష్, ప్రధానోపాధ్యాయురాలు స్వప్నతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more