June 22, 2026 10:56 pm

V1News Telangana

సామరస్యానికి ప్రతీకగా మొహర్రం.. సాలూరలో భక్తి శ్రద్ధలతో మౌలాలి పీర్ల పండుగ ప్రారంభం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర, జూన్ 22 (ప్రతినిధి):
నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని ముస్తాపై ఉన్న మౌలాలి పీర్ల వద్ద మొహర్రం (మొరం) పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం మౌలాలి వద్ద ప్రత్యేక మజ్మా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు నిర్వహిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో పీర్లను దర్శించుకున్నారు.
మొహర్రం పండుగ ముస్లింలకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. త్యాగం, ధర్మం, సత్యం, మానవత్వం వంటి విలువలను చాటిచెప్పే ఈ పండుగను కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలు కలిసి జరుపుకోవడం ప్రత్యేకత. గ్రామాల్లో, పట్టణాల్లో హిందూ–ముస్లిం సోదరభావానికి ప్రతీకగా ఈ వేడుకలు నిలుస్తుంటాయి.


మౌలాలి పీర్ల వద్ద జరిగిన మజ్మా కార్యక్రమంలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసి, రాష్ట్రంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మొహర్రం పండుగ సందేశమైన మానవత్వం, ఐక్యత, పరస్పర గౌరవం సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు.
మనసును హత్తుకునే సందేశం:
“మతాలు వేరైనా మనసులు ఒక్కటే.. మొహర్రం పండుగ మనిషిలోని మానవత్వాన్ని, సమాజంలోని సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పే పవిత్ర సందర్భం.”

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more