June 21, 2026 1:57 pm

V1News Telangana

ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ మరియు ఆయాల దరఖాస్తు పోడగింపు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ మరియు ఆయాల దరఖాస్తు పోడగింపు…

బోధన్ జూన్ 17 : ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ మరియు ఆయాల దరఖాస్తులను ఈనెల 18 వ తేది వరకు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు వరకు బోధన్ మండల విద్యాధికారి నాగయ్య తెలిపారు. బోధన్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అందాపూర్, DNT బెల్లాల్ పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాల బర్దిపూర్ మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గాంధీనగర్ (ఉర్దూ మీడియం)లలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించబడుతున్నాయి.
కావున ఈ పాఠశాలలలో బోధన నిర్వహించుటకు ఇన్‌స్ట్రక్టర్లు మరియు ఆయాల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
ఇన్స్ట్రక్టర్ కు అర్హతలు ప్రీ-ప్రైమరీ బోధకులకు కనీస విద్యార్హతగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. ప్రాథమిక బోధనలో ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా (DPSE) లేదా కనీసం రెండు సంవత్సరాల నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ (NTT/NTE) అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆయాలకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవీకరణ పత్రాల మూడు సెట్ల జిరాక్స్ ప్రతులను జతపరచి మండల విద్యా వనరుల కేంద్రం బోధన్ లో 18-06-2026 నాడు సాయంత్రము 5 గంటల లోపు సమర్పించాలన్నారు.
దరఖాస్తు ఫారాలు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, నందిని జిరాక్స్ సెంటర్ వద్ద అందుబాటులో ఉంచబడినవి. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవలసిందిగా బోధన్ మండల విద్యాధికారి నాగయ్య తెలిపారు.

Naveen Naveen
Author: Naveen Naveen

Leave a Comment

Read more
Read more