121 వాహనాలు సీజ్.. సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నిబంధనల పాటనపై ఏఎస్పీ సాయి కిరణ్ సూచనలు
భైంసా, జూన్ 19:
భైంసా పట్టణంలోని శాస్త్రినగర్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా టౌన్ సీఐ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై తనిఖీలను పర్యవేక్షించారు…
ఈ కార్డన్ సెర్చ్‌లో ముగ్గురు ఎస్‌ఐలు, 38 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా 112 బైక్‌లు, 4 ఆటోలు, 5 కార్లు కలిపి మొత్తం 121 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ సాయి కిరణ్ మాట్లాడుతూ, కాలనీల్లో దొంగతనాలు మరియు ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, భద్రమైన సమాజ నిర్మాణానికి పోలీసులకు సహకరించాలని కోరారు.


పట్టణంలో నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్డన్ సెర్చ్ కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







