బిచ్కుంద, జూన్ 18:
బిచ్కుంద మండల కేంద్రంలో కొనసాగుతున్న రిపల్స్ విద్యాసంస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా రిపల్స్ విద్యాసంస్థ తొలుత బిచ్కుంద పట్టణంలోని అద్దె భవనంలో నిర్వహించబడిందని, అనంతరం కందర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూమిలో షెడ్లు, రేకులతో గదులు నిర్మించి విద్యాసంస్థను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

అయితే, ఆ విద్యాసంస్థ నిర్మాణానికి సంబంధించి సిట్టింగ్ (Siting), డీటీసీపీ (DTCP), లేఔట్ అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో సంస్థకు సంబంధించిన చట్టపరమైన సమస్యలు తలెత్తితే అక్కడ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత విద్యాసంస్థ యాజమాన్యంతో చర్చించి స్థలాన్ని చట్టబద్ధం చేయాలని, లేదంటే నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న విద్యాసంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో PDSF జిల్లా అధ్యక్షుడు ఎన్. బాలరాజ్, TSP జిల్లా అధ్యక్షుడు మావురం శ్రీకాంత్, MSF జిల్లా అధ్యక్షుడు మెక్కా సాయి తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






