June 17, 2026 11:03 pm

V1News Telangana

బోధన్ ప్రభుత్వ పాఠశాల JC హై స్కూల్ లో పాఠ్యపుస్తకాల పంపిణీ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ ప్రభుత్వ పాఠశాల JC హై స్కూల్ లో పాఠ్యపుస్తకాల పంపిణీ

* ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మెరుగైన విద్య ను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి..

బోధన్ జూన్ 17 : బోధన్ మండలంలోని రాకాసిపేట్ ప్రభుత్వ పాఠశాల జెసి హైస్కూల్లో బుధవారం పాఠశాల విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలచంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి హాజరై పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న విలువలతో కూడిన విద్యతో పాటు ఉచిత యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఆటల పట్ల ప్రత్యేక శిక్షణ ఎన్నో సంవత్సరాల అనుభవంగాల ఉపాధ్యాయులు మొదలైన వసతులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటాయని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలన్నారు.
అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తున్నందుకు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Naveen Naveen
Author: Naveen Naveen

Leave a Comment

Read more
Read more