బోధన్‌లో BLOలకు SIR-2026పై ప్రత్యేక శిక్షణ
బోధన్, జూన్ 18:
బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో గురువారం గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమానికి సంబంధించి బోధన్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవల్ అధికారులు (BLOలు), BLO సూపర్వైజర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROలు)/తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనీలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరిగిన ఈ శిక్షణలో SIR-2026 ప్రత్యేక సవరణ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. ఓటరు జాబితా సవరణలో పాటించాల్సిన నిబంధనలు, మొబైల్ యాప్ వినియోగం, అర్హులైన ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేయడం, అనర్హ ఓటర్లను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టే విధానంపై అధికారులు విస్తృతంగా వివరించారు.
అలాగే, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులను ఆర్‌డీఓ సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న BLOలు అడిగిన సందేహాలకు మాస్టర్ ట్రైనీలు, సంబంధిత అధికారులు సమాధానాలు ఇచ్చి, విధుల నిర్వహణలో అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






