నిజామాబాద్ జిల్లా, మోస్రా మరియుబోధన్ మండలం:
మోస్రా మరియు బోధన్ మండల పరిధిలోని కొత్తపేట గ్రామం సమీప ప్రాంతాలు, ఉట్పల్లి పల్లి తండా, బెల్లాల్ పంట పొలాలు మరియు సమీప అడవి ప్రాంతాల్లో అక్రమ జూదం విస్తృతంగా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మోస్రా–నిజామాబాద్ మధ్య ఉన్న ఈ ప్రాంతాల్లో జూదగాళ్లు తరచూ అడ్డాలు మార్చుకుంటూ, రహస్యంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేకంగా గ్రామ చెరువు దారి, మామిడి తోటల సమీపంలోని కొండ ప్రాంతాలు ఈ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారినట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు గంజాయి మరియు మత్తు పానీయాలు సేవిస్తూ ‘అందర్-బహర్’ వంటి జూద ఆటలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఆటల ద్వారా నిమిషాల్లో వేల రూపాయలు, గంటల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ జూదానికి బానిసైన కొందరు వ్యక్తులు కుటుంబ బాధ్యతలను విస్మరిస్తూ, భార్యలపై హింసకు పాల్పడడం, వారి బంగారు ఆభరణాలను అమ్మించి జూదంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా కుదేలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ అక్రమ కార్యకలాపాలపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. కొద్ది కేసులు నమోదు చేసి, స్వల్ప జరిమానాలతో పరిమితం కావడం వల్ల సమస్య మరింత విస్తరిస్తోందని వారు అంటున్నారు.
అధికారులు తక్షణమే స్పందించి, అక్రమ జూదం నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుని, ఈ దందాను పూర్తిగా అరికట్టాలని గ్రామ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









