June 17, 2026 10:58 pm

V1News Telangana

స్కాలర్‌షిప్ పేరుతో అడ్మిషన్లు.. టీసీల కోసం ఫీజుల వసూళ్లు?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

చైతన్య ఒకేషనల్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డీఐఈఓకు విద్యార్థి సంఘాల వినతి…

బోధన్, జూన్ 17:
బోధన్ పట్టణంలోని చైతన్య ఒకేషనల్ కళాశాల యాజమాన్యంపై సమగ్ర విచారణ చేపట్టి, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఐఈఓ)కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకుడు ఎన్. బాల్‌రాజ్ మాట్లాడుతూ, కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోయినా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్ సమయంలో స్కాలర్‌షిప్‌ల పేరుతో విద్యార్థులను చేర్పించుకుని, చదువు పూర్తయిన అనంతరం టీసీలు, బోనఫైడ్‌లు, మెమోలు ఇవ్వాలంటే పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న కళాశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీఐఈఓను కోరినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీఐఈఓ, పూర్తి స్థాయి విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నవతే ప్రతాప్, రాజన్న, ఎండీ. మోసిన్, శ్రీకాంత్, రాజు, అవధూత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

“విద్య సేవ కావాలి… విద్యార్థులపై భారంగా మారిన వ్యాపారం కాదు!”

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more