April 22, 2026 6:01 pm

V1News Telangana

నిబంధనలకు విరుద్ధంగా దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బెల్ట్ షాపులు – అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, నిజామాబాద్ జిల్లా:
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రధాన రహదారుల పక్కన నిబంధనలకు విరుద్ధంగా దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోధన్–  బోధన్ రూలర్ హైవేల పక్కన–రుద్రూర్, రుద్రూర్–కోటగిరి మార్గాలతో పాటు వర్ని, చందూర్, మోసరా ప్రాంతాల్లో ఈ అక్రమ కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


రాత్రి 10 గంటలకే మూసివేయాల్సిన దాబాలు అర్ధరాత్రి తర్వాత కూడా కొనసాగుతూ, మద్యం సిట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాలం చెల్లిన ఆహార పదార్థాల విక్రయం, అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరగడంతో ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడుతున్నాయి.
ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనూ నాణ్యతలేని ఆహారం, మౌలిక వసతుల లేమి తీవ్ర సమస్యగా మారింది. పరిశుభ్రత లేకుండా ఆహారం తయారీ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా గ్రామాల వారీగా బెల్ట్ షాపులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ, కల్తీ మద్యం విక్రయాలు, అధిక ధరలు ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల గ్రామస్థాయి వేలంపాటల ద్వారా కూడా బెల్ట్ షాపులు నడపడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఈ పరిస్థితులపై సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం పై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకొని అక్రమ దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బెల్ట్ షాపులను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more