నవీపేట్ మండలంలోని నిజాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఇన్ఫినిటీ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా టీ-షర్ట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా, సుమారు లక్ష రూపాయల విలువ గల స్కూల్ బెంచీలను పాఠశాలకు అందజేసి, విద్యార్థుల్లో ఆనందం మరియు ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా సంస్థ రీజినల్ మేనేజర్ సోమా రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని, విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని తెలిపారు. సమాజ సేవలో తమ ఇన్ఫినిటీ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇన్ఫినిటీ ఏరియా మేనేజర్ గజ్జెల నరేష్, బ్రాంచ్ మేనేజర్ రాము, గ్రామ సర్పంచ్ సురకత్తుల్ల నరేష్ తదితరులు పాల్గొని సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








