April 19, 2026 6:49 am

V1News Telangana

బోధన్‌లో రైస్ మిల్లుపై సీసీఎస్–పోలీసుల దాడి 144.2 క్వింటాళ్ల PDS ధాన్యం స్వాధీనం – వాహనాలు సీజ్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్‌లో ఉన్న సాయి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై సీసీఎస్ బృందం మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) కింద పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి చేపట్టారు.

దాడి సమయంలో సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ హనుమాన్ పర్యవేక్షణలో పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు ఆటోలు మరియు ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న PDS ధాన్యాన్ని గుర్తించారు. మొత్తం 144.2 క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని, సంబంధిత వాహనాలను సీజ్ చేశారు.
ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోలు, నిల్వ లేదా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ SHO హెచ్చరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more