May 23, 2026 4:15 am

V1News Telangana

వ్యాస పౌర్ణమి మహోత్సవాల్లో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొనడంతో వేడుకలకు ఊపెత్తు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

వి 1 న్యూస్.బాసర, జూలై 10:ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో నిర్వహించిన వ్యాస పౌర్ణమి మహోత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. గురువారం ఉదయం జరిగిన చివరి దిన వేడుకల్లో ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని, వ్యాస మహర్షికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఉత్సవాల చివరి రోజున, ఆలయ వైదిక బృందం ఆధ్వర్యంలో మహాకాళి, మహాలక్ష్మి దేవతల ప్రత్యేక పూజలు, వ్యాసేశ్వర స్వామికి విశేష ద్రవ్యాలతో మహా అభిషేకం, అలంకరణ, రుద్రహోమం, బలిప్రధానం, పూర్ణాహుతి వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా ఆలయ అధికారులు, వైదికులు ఘన స్వాగతం పలికారు.
స్థానిక నాయకులు, ఆలయ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ప్రజలతో కలిసి వీక్షించారు.ప్రజలతో మమేకమవుతూ మాట్లాడిన ఎమ్మెల్యే రామారావు పటేల్, గురు పౌర్ణమి దినం తల్లి సరస్వతి ఆశీస్సులతో జ్ఞానోదయాన్ని అందించే పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. బాసర పుణ్యక్షేత్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు….

chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

Leave a Comment

Read more
Read more