May 20, 2026 10:39 am

V1News Telangana

సాలూరులో కబ్జాల రాజ్యం..? ప్రభుత్వ భూములు, కాలువలపై పెరుగుతున్న ఆక్రమణలు – అధికార యంత్రాంగంపై ప్రజల ప్రశ్నల వర్షం”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూరు, మే 20:

సాలూరు మండల పరిధిలో ప్రభుత్వ భూములు, పంట కాలువలు, పైట కలువలు, పానాధులు, డ్రైనేజీ మార్గాలు వరుసగా ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నెలలు, ఏళ్లు గడుస్తున్నా సమస్యలకు శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంతో ప్రజలు సంబంధిత అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ అధికారులు, తహసీల్దార్ కార్యాలయం, రెవెన్యూ విభాగం, నీటిపారుదల శాఖ, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు సమస్యలను తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి నోటీసులు జారీ చేయడం మినహా, భూ ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో గ్రామ సర్పంచ్ వ్యవస్థ కూడా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. గ్రామ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, కాలువల సంరక్షణ, ఆక్రమణల నివారణ విషయంలో స్థానిక పాలన వ్యవస్థ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర సర్వేలు ఎప్పుడు చేపడతారు? డ్రైనేజీలు, పంట కాలువలు, పానాధుల అసలు పరిస్థితి ఏమిటి? ఆక్రమణల వెనుక ఉన్న శక్తులు ఎవరు? అనే ప్రశ్నలు స్థానికంగా చర్చకు దారితీస్తున్నాయి.

స్థానికుల ఆరోపణల ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు పెరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. చిన్న చిన్న అంశాలపై వెంటనే స్పందించే వ్యవస్థ, ప్రభుత్వ భూములు మరియు ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన కాలువలు ఆక్రమణలకు గురైతే ఎందుకు నిశ్శబ్దంగా ఉంటోందని ప్రశ్నిస్తున్నారు.

మీడియా కథనాలు, ప్రజా ఫిర్యాదుల ద్వారా పలుమార్లు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామస్థాయిలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ భూములు, పంట కాలువలు, డ్రైనేజీ మార్గాలపై ప్రత్యేక సర్వేలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్దఎత్తున ఆక్రమణలు ఉన్నట్లయితే జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ కార్యాలయం, పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ విభాగం, నీటిపారుదల శాఖ సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

“సాలూరులో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే చర్యలు ఎప్పుడు ప్రారంభమవుతాయి..? సమగ్ర సర్వేలు ఎప్పుడు జరుగుతాయి..? ప్రజా అవసరాల కోసం ఉన్న భూములు, కాలువలు ఎప్పుడు రక్షణ పొందుతాయి..?” అన్న ప్రశ్నలు ప్రస్తుతం స్థానికంగా ప్రధాన చర్చగా మారాయి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, సమగ్ర సర్వేలు చేపట్టి, ప్రభుత్వ భూములు – కాలువలు – డ్రైనేజీ మార్గాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more