Post Views: 147
22న ఏకచక్రనగర్ బస్తీలో హిందూ సమ్మేళనం…
బోధన్ మే 21: బోధన్ పట్టణంలోని శ్రీ స్వయంభు అనంత లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు సమ్మేళనం నిర్వహించనట్లు సమితి నిర్వాహకులు తెలిపారు. హిందూ సమాజాన్ని చైతన్యపరిచి ధర్మం , సంస్కృతి మరియు హిందూ సమాజాన్ని ఒక తాటిపై నిలిపేందుకు ఈ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని అన్నారు. కావున ప్రతి ఒక్క హిందువు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సద్గురు సోమలింగ శివాచార్య మహారాజ్ పాల్గొంటున్నట్లు తెలిపారు.








