ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు సూచించిన కౌన్సిలర్ లంకా రవి..
బోధన్, మే 19:
ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద మంగళవారం ప్రజలకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, కార్మికులు మరియు స్థానిక ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ గారు పాల్గొని ప్రజలకు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో అవసరం లేకుండా బయట తిరగవద్దని సూచించారు.
ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని తెలిపారు. అలాగే ప్రజలు ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








