ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కట్టుబడి ఉన్నారు : ఆర్డీవో విజయ కుమారి..

బోధన్, మే 18:
బోధన్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “డివిజనల్ ప్రజాపాలన” కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీమతి ఎం. విజయ కుమారి పాల్గొని, డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజల వినతులను పరిశీలించారు.
భూ సమస్యలు, మున్సిపల్ అంశాలు, ఇరిగేషన్, విద్యుత్, కుల ధృవీకరణ, పన్నులు, గృహ నిర్మాణం, సీనియర్ సిటిజన్ సమస్యలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 10 దరఖాస్తులు నమోదు అయ్యాయి.
ఈ సందర్భంగా ఆర్డీవో విజయ కుమారి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అర్జీదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
అలాగే ప్రతి సోమవారం ఉదయం నిర్వహించే “డివిజనల్ ప్రజాపాలన” కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








