May 23, 2026 4:14 am

V1News Telangana

ఎలక్షన్ కు విఘాతం కలిగించి ఆగిపోవడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోండి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

‎నిజామాబాద్ నగరంలో ఆదివారం రోజు ఆర్యవైశ్య సంఘం పట్టణ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

అయితే సాయంత్రం కొందరు ఎలక్షన్ కు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలలో పోటీ చేసిన కసుబ సంపత్ అనే అభ్యర్థి ఆరోపించారు.

 

సాక్షాత్తు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ముందే ఇదంతా హై డ్రామ జరిగిందని ఆయన అన్నారు.

 

ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికను డిస్టర్బ్ చేయాలని ఉద్దేశంతో కావాలని కొందరు బ్యాలెట్ పేపర్లు బయట దొరికాయని నాన హంగామ సృష్టించి ఎన్నికలకు విఘాతం కల్పించారని ఆయన ఆరోపించారు.

 

అంతేకాకుండా ఎన్నికల అధికారులపై కొందరు సభ్యులపై నోటికొచ్చినట్టు మాట్లాడి దురుసుగా ప్రవర్తించారని తప్పు వాళ్ళు చేసి రెండు గంటల పాటు ధర్నా నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..

 

దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని ఎన్నికల అధికారి విజయ్ కుమార్ మరియు ఎలక్షన్ కమిటీకి అందజేశారు..

వెంటనే వారినీ ఎన్నికల నుండి తొలగించి మరోసారి ఇలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని ఆయన కోరారు..

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

Leave a Comment

Read more
Read more