. శ్రీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా..
. సాయిబాబా ఆశీస్సులతో భక్తుల సందడి..
. శ్రీ సాయినాథుని సేవలో భక్తుల మేళం.
. బోధన్ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పూజా కార్యక్రమాలు..
గురుపౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ సాయి ఆశీర్వాదాలు..
బోధన్, జూలై 10:
శ్రీ సాయినాథాయ నమః…
జిల్లా నిజామాబాద్ బోధన్ పట్టణంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. “సాయి భక్తులందరికీ గురుపౌర్ణిమ శుభాకాంక్షలు. సాయి కృప భక్తులందరికీ లభించాలని మనసారా ప్రార్థిస్తూ!” ఆలయ నిర్వహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సత్యనారాయణ వ్రతం, నామసంకీర్తన కార్యక్రమాలు నిర్వహించగా, బోధన్ పట్టణం తో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాల పంపిణీ కూడా జరిగింది.

వేదికను విద్యుత్ కాంతులతో, పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పోలీస్ మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ట్రాఫిక్ మరియు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. గురుపౌర్ణిమ సందర్భంగా గురు తత్వం గొప్పతనాన్ని గుర్తు చేస్తూ పలువురు పండితులు సందేశాలు ఇచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








