May 23, 2026 4:14 am

V1News Telangana

ఇది పాలనా? లేక మాఫియాల పండుగనా?” – ప్రజల కడుపు మీద మాఫియా దండయాత్ర. మాఫియా ఏజెంట్ నుంచీ కొందరు స్థానిక నాయకులు వరకు… ఈ మాఫియాల్లో పాత్ర ఏంటి?” “సెటిల్మెంట్ల రాజకీయాల కోసమేనా ప్రజల ఆకలి మీద దాడి?” “ప్రతి ఆఫీసులో దొర్లే నిశ్శబ్ద ఒప్పందాల వెనక చేతులు ఎవరివి?”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం, పలు మండలంతో పాటు పలు గ్రామాల్లో ఒకటి కాదు – ఏకంగా మాఫియాల పల్లకీ పరుగు పెడుతోంది. ఇసుక మాఫియా, మొరం మాఫియా, కల్లు మాఫియా, బెల్ట్ షాప్ మాఫియా, వైన్స్ షాప్ మాఫియా… ఇప్పుడు వీటన్నింటికి తోడు ‘పిడిఎస్ బియ్యం మాఫియా’ రూపంలో పేదల ఆకలి మీద నాట్యం జరుగుతోంది.

ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యం ఇప్పుడు మాఫియాల చేతుల్లో బలవుతోంది. కొందరు రైస్ మిల్లర్లు, దళారులు కలిసి వ్యాపారంగా మార్చిన ఈ పథకం – లక్షల రూపాయల బ్లాక్ మార్కెట్ బియ్యాన్ని బయటికి తరలించడంలో కీలకంగా మారింది. గోదాముల నుంచి ట్రక్కులు, ఆటోలలో బియ్యం తరలింపులు జరగుతున్నా, అధికార యంత్రాంగం మౌనంగా చూస్తోంది.

ఇది కేవలం నిర్వాకమా? లేక ఇంకెదేనా కుట్ర? అధికారుల నిర్లక్ష్యం కాదు… ఇదే మాఫియాకి మద్దతా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రజల ప్రశ్న :
“ మాఫియా ఏజెంట్ నుంచీ కొందరు స్థానిక నాయకులు వరకు… ఈ మాఫియాల్లో పాత్ర ఏంటి?”
“సెటిల్మెంట్ల రాజకీయాల కోసమేనా ప్రజల ఆకలి మీద దాడి?”
“ప్రతి ఆఫీసులో దొర్లే నిశ్శబ్ద ఒప్పందాల వెనక చేతులు ఎవరివి?”

ప్రజల డిమాండ్ :

తక్షణమే మాఫియా కార్యకలాపాలపై చర్యలు

సంబంధిత మిల్లులపై రైడ్లు

రేషన్ గోదాములపై పటిష్ట నిఘా

అధికారులపై విచారణ

బాధితుల పక్షాన అధికారుల స్పందన

ఇకనైనా మారకపోతే – ప్రజల తిరుగుబాటు దూరం లేదు!
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే ఇప్పుడు ప్రభుత్వమే స్పందించాలి. లేదంటే ఈ పాలనపై ప్రజల విశ్వాసమే శవపేటికలోకి వెళ్లిపోతుంది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more