May 23, 2026 3:29 am

V1News Telangana

పల్సి గ్రామ దేవతల మహోత్సవంలో బీఆర్‌ఎస్ నాయకుడు విలాస్ గాదెవార్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పసి మండలంలోని పల్సి గ్రామంలో గ్రామ దేవతల ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవానికి బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు, నమ్మనవకర్త విలాస్ గాదెవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గ్రామస్తుల ఆహ్వానాన్ని స్వీకరించి, అమ్మవార్ల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
ఈ సందర్భంగా విలాస్ గాదెవార్ మాట్లాడుతూ, “పసి మండల అభివృద్ధికి పాలకులు స్పందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా ఎంతో అవసరం” అని తెలిపారు. అలాగే పాలకులకు బుద్ధి ప్రసాదించాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ రాజన్న, హనుమాన్లు, మాజీ సర్పంచ్ రాజు, ధర్మపుర దిలీప్ రాజ్ కుమార్, సంజు, సంతోష్ సహా పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల సందడి మధ్య వేడుక వైభవంగా సాగింది.

chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

Leave a Comment

Read more
Read more