నవీపేట (నిజామాబాద్):
ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకం నిజామాబాద్ జిల్లాలో ఉధృతంగా కొనసాగుతోంది. ఇందల్వాయి మండలంలో ధరణి శ్రీ ఆసుపత్రి వ్యవహారం మరువకముందే, నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలోని లక్ష్మీ ఆసుపత్రి వివాదాస్పదంగా మారింది.
ఈ ఆసుపత్రి సిద్ధి వినాయక ఆసుపత్రి బ్రాంచ్ అంటూ బోర్డులు పెట్టి, ప్రజలను మోసం చేస్తోంది. కానీ వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు, షరతుల విషయంలో పూర్తిగా విఫలమైంది. ఆసుపత్రికి భవన అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, అవసరమైన నిబంధనలు ఇంకా సమర్పించని దాఖలాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఇక్కడ పనిచేస్తున్న వైద్యుడు సరైన రిజిస్ట్రేషన్ లేకుండానే సేవలు అందిస్తున్నాడు. అంతేకాకుండా, అనర్హ పారామెడికల్ సిబ్బంది ఐవి సెట్లు వేసి, ఇంజెక్షన్లు ఇవ్వడం, జిఎన్ఎమ్, ఏఎన్ఎమ్ అర్హతలేమి ఉన్న వారు బాధ్యతలు చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఫార్మసీ కూడా సరైన ఫార్మసిస్టు లేకుండా నడుపుతున్నారు. ఈ అక్రమాలను సంబంధిత శాఖలు గమనించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ ఆసుపత్రులపై సత్వర చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య శాఖ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








