May 23, 2026 4:14 am

V1News Telangana

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

– సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం

– అధిక సంఖ్యలో హాజరైన భక్తజన సందోహం

– ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం

– రామనామ స్మరణలతో, భజన సంకీర్తనలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ

– భక్తులకు మహా అన్నప్రసాద వితరణ ఏర్పాటు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వేడుకలలో భాగంగా ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండల తహసిల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా సీతారాముల కల్యాణాన్ని తిలకించి దర్శించుకున్నారు. భక్తులు సీతారాముల కళ్యాణంలో భక్తి శ్రద్దలతో పాల్గొని మై మరచిపోయారు. రామనామ స్మరణలతో , భక్తి గీతాలతో, భజన సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కళ్యాణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాద పానీయాలు , అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అరిగె నారాయణ,మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ (నందు) రెడ్డి, గ్రామ అధ్యక్షులు అయినాల లింగం, రాజేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, గొడిసెల నరసింహులు గౌడ్, బొడిగె భాను ప్రకాష్ గౌడ్, చుంచు సాయిలు, గుత్తుల శ్రీనివాస్, ముస్త్యాల శ్రీధర్, భోధనం సాయిలు, అనుసూరి శ్రీనివాస్, సాయ గౌడ్, అల్లం సాయిలు, సందీప్ గౌడ్, పసుపు సాయిలు, రాఘవ, టేకుర్ల సాయిలు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more