June 23, 2026 11:52 pm

V1News Telangana

43 మందికి ఉచిత కంటి పరీక్షలు – 16 మందికి శస్త్రచికిత్స కోసం రిఫరల్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

భిర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

బీర్కూర్, జూన్ 23 (వార్త):
జూలై 1, 2025 నుంచి నేటి వరకు భిర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పరంపరలో భాగంగా సోమవారం మరో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరంలో కంటి వైద్య సహాయకులు సతీష్ గారు మొత్తం 43 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటి సమస్యలు గుర్తించిన 16 మంది రోగులను శస్త్రచికిత్స కోసం బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ నిరంతరం ముందుంటోందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కంటి వైద్య సహాయకులు సతీష్ సర్, భిర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలె రమేష్, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు మేకల విఠల్, ఎం.ఏ. రషీద్ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more