June 23, 2026 11:56 pm

V1News Telangana

బోధన్‌లో SIR-2026 హెల్ప్ డెస్క్ ప్రారంభం.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : ఆర్డీవో..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూన్ 23 (ప్రతినిధి):

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR-2026)లో భాగంగా బోధన్ అసెంబ్లీ నియోజికవర్గ ఎన్నికల సెల్‌లో హెల్ప్ డెస్క్‌ను ఆర్డీవో ప్రారంభించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ డెస్క్‌ను మంగళవారం ఆర్డీవో మేడమ్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ తహసీల్దార్ శ్రీ పి. విఠల్, సీనియర్ అసిస్టెంట్ సుశీల, ఆపరేటర్ ముస్తఫా తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, SIR-2026 ప్రక్రియలో ఓటర్లకు ఎదురవుతున్న సందేహాలు, సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటరు వివరాలకు సంబంధించిన సమాచారం, సవరణలు, అభ్యంతరాలు మరియు ఇతర అంశాలపై స్పష్టత పొందాలని సూచించారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎన్నికల సంఘం ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రజల సహకారంతో SIR-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more