June 23, 2026 11:37 pm

V1News Telangana

ప్రభుత్వ విద్యపై విశ్వాసానికి నిదర్శనం.. కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించిన మందర్న సర్పంచ్…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

చదువే శాశ్వత సంపద.. ప్రభుత్వ బడే ప్రతి బిడ్డ భవిష్యత్తుకు బంగారు బాట.”
“తన బిడ్డను ప్రభుత్వ బడిలో చేర్చిన నాయకుడే నిజమైన ప్రజాప్రతినిధి.”

నిజామాబాద్ జిల్లా, సాలూర మండలం, మందర్న గ్రామం, జూన్ 23 (ప్రతినిధి):
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా మందర్న గ్రామ సర్పంచ్ రావువ సావిత్ర గంగాధర్ తన కుమార్తె ఆర్. దివ్యను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ విద్యపై తమకున్న నమ్మకాన్ని ఆచరణలో చూపిస్తూ ఇతర తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా మందర్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ రావువ సావిత్ర గంగాధర్, ఉపసర్పంచ్ శిరీష ప్రహ్లాద్, మహిళా సంఘం అధ్యక్షురాలు కుక్కలుగే శకుంతల, ప్రధానోపాధ్యాయురాలు వసంత మేడం చేతుల మీదుగా విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more