బోధన్, జూన్ 20:
సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల పేరుతో స్థానిక వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ, డబ్బులు వసూలు చేయడానికి యత్నించిన ఘటన బోధన్ పట్టణంలో కలకలం రేపింది. హోటల్ యజమానిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.30 వేల నగదు డిమాండ్ చేసిన ముగ్గురు వ్యక్తులపై బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బోధన్ పట్టణానికి చెందిన బోడిగం సతీష్ కుమార్ స్థానికంగా “దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్” నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో నసీర్ బేగ్ (జెడ్ టుడే న్యూస్), లింబాయి సతీష్ (దృశ్యం న్యూస్)తో పాటు మరో వ్యక్తి రెస్టారెంట్‌కు వెళ్లి, ఒక కస్టమర్ ద్వారా “రెస్టారెంట్‌లో ఫుడ్ బాగాలేదని” పేర్కొంటూ వీడియో చిత్రీకరించినట్లు సమాచారం.

అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసి హోటల్ వ్యాపారాన్ని దెబ్బతీస్తామని బెదిరిస్తూ, వీడియోను బయటకు విడుదల చేయకుండా ఉండాలంటే రూ.30 వేల నగదు ఇవ్వాలని యజమానిని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యజమాని డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.
అయితే మరుసటి రోజు, అంటే జూన్ 18న, సదరు వీడియోను వివిధ యూట్యూబ్ ఛానళ్లు, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ గ్రూపులలో ప్రచారం చేసి, రెస్టారెంట్ ప్రతిష్టకు, వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగించినట్లు బాధితుడు సతీష్ కుమార్ ఫిర్యాదులో ఆరోపించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మీడియా లేదా యూట్యూబ్ ఛానళ్ల పేరుతో వ్యాపారస్తులను బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం, వసూళ్లకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








