June 19, 2026 12:31 am

V1News Telangana

పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

10వ తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాల అందజేత

బోధన్ జూన్ 18: బోధన్ మండలంలోని పెంటకుర్దు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా సంవత్సరం (2025-26)లో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు గురువారం నగదు పురస్కారాలను అందజేయడం జరిగింది. సాలంపాడు గ్రామానికి చెందిన ఎన్నారై శ్రీ దేవినేని శ్రీకాంత్ విద్యార్థులను ప్రోత్సహించే సదుద్దేశంతో నగదును శ్రీకాంత్ గారి తల్లిదండ్రులు దేవినేని సత్యనారాయణ మరియు పార్వతి గార్ల చేతుల నగదు మీదుగా ఈ పురస్కారాలను విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని అక్షయకు రూ.15,000/- నగదు, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థి రిషబ్ కిరణ్ కు రూ.10,000/- నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ప్రతిభ, పట్టుదలను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలాన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ స్వగ్రామం మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానన్నారు.

Naveen Naveen
Author: Naveen Naveen

Leave a Comment

Read more
Read more