May 2, 2026 9:21 pm

V1News Telangana

బయట తాళం.. లోపల దందా..! హైవే దాబాల్లో అక్రమాల మయం..హైవేల వెంట అక్రమ కేంద్రాల ఆగడాలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బయట తాళం.. లోపల దందా..! హైవే దాబాల్లో అక్రమాల మయం
ఉమ్మడి బోధన్  హైవే పక్కన అక్రమ వ్యాపారాల జోరు
రాత్రి మూసివేత నాటకం.. లోపల మద్యం సిట్టింగ్లు యథావిధిగా
దాబాలు, బెల్ట్ షాపులు, నాసిరకం ఫుడ్ సెంటర్లు..! అధికారులు ఎక్కడ..?
హైవేల వెంట అక్రమ కేంద్రాల ఆగడాలు.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
పేదలపై కేసులు.. పెద్దల అక్రమాలపై మౌనం ఎందుకు..?


నిజామాబాద్, మే 2: బోధన్ రహదారుల వెంట నిబంధనలకు విరుద్ధంగా దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా Bodhan– నుండి రూలర్. హైవే పరిసర ప్రాంతాల్లో ఈ అక్రమ కార్యకలాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలకే మూసివేయాల్సిన కొన్ని దాబాలు బయటకు తాళం వేసినట్లు చూపిస్తూ, లోపల మాత్రం అర్ధరాత్రి దాటినా మద్యం సిట్టింగ్లు, మాంసాహార విందులు కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బయటకు మూసివేసినట్లు కనిపించినా, లోపల వ్యాపారం యథావిధిగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించడం, పరిశుభ్రత లేకుండా ఆహారం తయారు చేయడం, నాసిరకం నూనెలతో వంటకాలు అందించడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక గ్రామాల వారీగా బెల్ట్ షాపులు పెరిగిపోవడం మరో సమస్యగా మారింది. అధిక ధరలకు మద్యం విక్రయాలు, నకిలీ మరియు కల్తీ మద్యం సరఫరా, అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో యువత చెడు అలవాట్ల బారిన పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇన్ని అక్రమాలు బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. “రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేసే పేదలపై వెంటనే చర్యలు తీసుకుంటారు.. కానీ హైవే పక్కన పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలపై ఎందుకు మౌనం?” అని ప్రశ్నిస్తున్నారు.
కొన్ని అక్రమ కేంద్రాలకు స్థానిక స్థాయి అధికారులే అండగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పై అధికారులు వెంటనే ప్రత్యేక దాడులు నిర్వహించి, అక్రమ దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హైవేలు ప్రజల రాకపోకల కోసం కావాలి గానీ, అక్రమ దందాలకు కాదని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more