April 26, 2026 7:17 pm

V1News Telangana

సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి ఏసీపీగా పదోన్నతి – శ్రీశైలం అభినందనలు అందుకున్న పోలీస్ అధికారి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్, ఏప్రిల్ 25:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ పి. శ్రీశైలం గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదా నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పదోన్నతి పొందారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ ప్రమోషన్ అమలులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పదోన్నతి పొందిన అనంతరం శ్రీశైలం గారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు శ్రీశైలం గారికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.


గత కొంతకాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న శ్రీశైలం గారికి ఈ పదోన్నతి రావడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
పోలీసు శాఖలో దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆయనకు ఈ పదోన్నతి రావడం గర్వకారణమని సహచరులు పేర్కొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more