V1News Telangana

best news portal development company in india

సుంకినిలో ఇసుక దందా.. ఎంఎల్యే పేరు తెచ్చుకొని రెచ్చిపోతున్న మాఫియా! ఇంద్రమ్మ ఇళ్ల ముసుగులో ఇసుక అక్రమ రవాణా.. అధికారుల మౌనమే అనుమతి!… సుంకిని నుండి బోధన్ వరకు అక్రమ ఇసుక రవాణాకు రెడ్ కార్పెట్..?… . ఇసుక కోసం గ్రామాలు ఖాళీ.. న్యాయం కోసం ఎవరుంటారు? గ్రామసభల నడుమ సుంకినిలో ఇసుక రగడ! సుంకినిలో ఇసుక మాఫియా ఆర్బిట్రేషన్‌.. ఎంఎల్ఏ పేరు చెప్పి రెచ్చిపోతున్న రవాణాదారులు!

SHARE:

పోతంగల్ మండలం, జూన్ 6:ఇసుక మాఫియా సుంకిని గ్రామాన్ని పట్టు వేసింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా జరగడం స్థానికుల కలవరానికి కారణమవుతోంది. గ్రామస్తుల మాటల్లో, “మాకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి, ఎవరు ఏమీ చేయలేరు” అంటూ రవాణాదారులు చెలరేగిపోతున్నారు. ఇదంతా ఇంద్రమ్మ ఇళ్ల పేరిట జరుగుతుండటం గమనార్హం.

 

పెనుగొట్టిన ఈ అక్రమ చైతన్యం బోధన్ మండలంలోని పెంట గ్రామం మీదుగా రకాస్‌పేట్, ఆచన్‌పల్లి ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మౌనంగా ఉండడం గమనించదగిన అంశం.

‘‘ఇసుక వాహనాలు ఆపితే తోడుకలు తీయాలన్న ఎమ్మల్యే హెచ్చరికల వల్ల గ్రామస్తులు నోరు మెదపలేరు..’’ అంటూ స్థానికులు వాపోతున్నారు. ఇక పోతంగల్ రెవెన్యూ అధికారుల మౌనానుమతితోనే ఈ అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారులు మాత్రం గ్రామసభల పేరుతో బిజీగా ఉండగా, మాఫియాకు ఓపెన్ పాసులా మారిన సుంకిని..
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india