తేదీ: శుక్రవారం, 06 జూన్ 2025
ప్రాంతం: బైంసా, నిర్మల్ జిల్లా
బైంసా పట్టణంలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు సూచనలు చేస్తూ పట్టణ సీఐ గోపీనాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పట్టణ ప్రజలందరికీ, ముఖ్యంగా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ శాంతి, సౌభ్రాతృత్వంతో పండుగను జరుపుకోవాలి” అని తెలిపారు.
బక్రీద్ ప్రార్థనలకు భద్రతా పరంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ట్రాఫిక్ మరియు పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు విభాగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.
ప్రత్యేక సూచనగా, మసీదు ప్రాంతాలలో ఉన్న కమిటీ మెంబర్లను ఉద్దేశించి మాట్లాడుతూ – ప్రజలందరూ ఒకేసారి కాకుండా, ఏరియా వారీగా కొద్దికొద్దిగా బయలుదేరాలని కోరారు. ఒక్కసారిగా భారీగా ప్రజలు వచ్చితే ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే ప్రమాదం ఉన్నందున, ఐదు నిమిషాల గ్యాప్ లో ప్రజలు తరలివస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని సూచించారు.
పార్కింగ్ ప్రాంతాల్లో ప్రజలు పోలీసులకు సహకరించాలని, పండుగను పూర్తి ప్రశాంతతతో జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533








