May 23, 2026 5:16 am

V1News Telangana

అమ్మ మాట – అంగన్వాడి బాట

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

– అంగన్వాడి కేంద్రం పిల్లల భవితకు మొదటి అడుగు

– విద్యతోపాటు ఆటపాటలు, పౌష్టికాహారం అందిస్తున్నామని వివరణ

– “ప్రైవేటు బడి వద్దు అంగన్వాడి ముద్దు”అని పలు సూచనలు

– ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల పరిధిలోని కాంశెట్ పల్లి మరియు నసురుల్లాబాద్ గ్రామాలలో గల అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం రోజు ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి ఆధ్వర్యంలో “అమ్మ మాట-అంగన్వాడి బాట” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాణి విద్యార్థుల తల్లులతో మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు దాటిన పిల్లలను తప్పకుండా అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పసిపిల్లల యువ క్షేమాలను దృష్టిలో ఉంచుకొని వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని కొనియాడారు. అంగన్వాడీ కేంద్రం లో ఆటపాటలు, విద్యతో పాటు పౌష్టికాహారం అందించబడుతుందని తెలియజేశారు. ప్రైవేటు స్కూల్లలో వేల రూపాయల ఫీజులు వసూలు చేయడం వలన పేద ,మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. “ప్రైవేటు బడి వద్దు అంగన్వాడి ముద్దు”అని వివరించారు. పసిపిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో బాల్యం నుండి క్రమశిక్షణతో కూడిన విద్యను బోధిస్తున్నామని తెలిపారు. అంగన్వాడి కేంద్రం పిల్లల భవితకు మొదటి అడుగు అని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించడం వలన వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా కృషి చేస్తామని తల్లులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లు గౌరి , గంగామణి, ఐకెపి మండల అధ్యక్షురాలు శోభ , విద్యార్థుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more