May 23, 2026 5:13 am

V1News Telangana

బోధన్ MSR బార్‌ లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు – జర్నలిస్టుపై దాడికి తీవ్ర నిరసనలు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ పట్టణంలోని రాకస్పేట ప్రాంతంలో లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సమీపంలో నిర్వహిస్తున్న MSR బార్ & రెస్టారెంట్ తాజాగా వివాదాస్పదంగా మారింది. చట్టవిరుద్ధంగా అర్ధరాత్రి వరకు బార్‌ను నిర్వహిస్తూ, ప్రభుత్వ నిబంధనలను లంగిచి ప్రజా భద్రతకు ముప్పుగా మారుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం, రాత్రివేళల్లో మద్యం సేవించిన వ్యక్తులు రోడ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళలు, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాలు కలిగిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రివేళలకే ఎక్కువ ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు రాజ్ న్యూస్ టీవీకి చెందిన జర్నలిస్ట్ శ్రీ ఎండీ సయీద్ గారు, మే 30వ తేదీన ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. మరుసటి రోజు (మే 31) మరింత సమాచారం కోసం బార్ వద్దకు వెళ్లిన సమయంలో, బార్ యజమాని వినీత్ అలియాస్ విన్ను మరియు అతని సిబ్బంది జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

ముఖ్యంగా ఇది మీడియా స్వేచ్ఛను ఉల్లంఘించే చర్యగా భావించవలసిన దాడిగా విలేఖరుల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బాధిత జర్నలిస్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి కేసు నమోదు కాలేదని సమాచారం. ఇది బాధాకరమని పలు మేధావి వర్గాలు, హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

ఈ అంశంపై VHPS జాతీయ అధ్యక్షులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత బార్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుపై జరిగిన దాడికి న్యాయం జరగాలని, బార్ లైసెన్స్ నిబంధనలు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more